చారిత్రక ఘట్టం : ఏపీ సీజేగా ప్రవీణ్‌కుమార్ ప్రమాణం

ఏపీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌ నరసింహన్‌ చీఫ్ జస్టిస్‌తో పాటు మిగిలిన జడ్జిలతో ప్రమాణస్వీకారం చేయించారు.

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 07:33 AM IST
చారిత్రక ఘట్టం : ఏపీ సీజేగా ప్రవీణ్‌కుమార్ ప్రమాణం

ఏపీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌ నరసింహన్‌ చీఫ్ జస్టిస్‌తో పాటు మిగిలిన జడ్జిలతో ప్రమాణస్వీకారం చేయించారు.

విజయవాడ: ఏపీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌ నరసింహన్‌ చీఫ్ జస్టిస్‌తో పాటు మిగిలిన జడ్జిలతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీరమణ హాజరయ్యారు. దీంతో ఏపీ ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల పిటిషన్లు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. హైకోర్టుకు 37మంది న్యాయమూర్తులు కేటాయించగా, ప్రస్తుతం 14 మంది ఉన్నారు. ఏపీ విభజన క్రమంలో 62ఏళ్ల తర్వాత 2018 డిసెంబర్ 31 సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది. 2018 డిసెంబర్ 26న ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడింది.