CSKvsRR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై చిదంబరం స్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 31న తలపడనుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన చెన్నై గత సీజన్ హవానే కొనసాగిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవక పేలవమైన రికార్డుతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో జట్టు తీవ్రంగా ప్రాక్టీసు చేసింది.
రాజస్థాన్ రాయల్స్:
అజింకా రహానె(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతం, జోఫ్రా ఆర్చర్, జయదేశ్ ఉనదక్త్, శ్రేయాస్ గోపాల్, ధావల్ కుల్‌కర్ణి
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోనీ, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మిచెల్ శాంతర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్