రాజధాని అలజడులపై సీఎంతో డీజీపీ సవాంగ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 06:11 AM IST
రాజధాని అలజడులపై సీఎంతో డీజీపీ సవాంగ్ భేటీ

Updated On : January 8, 2020 / 6:11 AM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి ఘటనపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆందోళన, ధర్నాలు, రిలే దీక్షలు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడికి సంబంధించి డీజీపీ.. సీఎం జగన్ కు వివరించనున్నారు. 

పెద్ద ఎత్తున రైతులు, ఆందోళనకారులు రహదారిపైకి రావడం, ఒక్కసారిగా ఆందోళనకారులంతా ఎమ్మెల్యే రామకృష్ణ కారుపై దాడి ఘటనపై డీజీపీ పూర్తి వివరణ ఇవ్వబోతున్నారు. రాజధాని గ్రామాల్లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కాబట్టి..అక్కడున్న ఆందోళనకారులు ఏ విధంగా దాడులు చేస్తున్నారు. గతంలో మీడియా ప్రతినిధులపై కొంతమంది ఆందోళనకారులు దాడి చేశారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కారుపై దాడి ఘటనలతోపాటు రైతుల ఆందోళనలపై పూర్తిస్థాయిలో చర్చ జరుగబోతుంది.

రైతుల ఆందోళనలు, ఎమ్మెల్యే  రామకృష్ణ కారుపై దాడితోపాటు తదితర విషయాలపై సీఎం జగన్ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న దాడి ఘటనతో ఇకముందు ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రత చర్యలు కట్టుదిట్ట చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇవ్వనున్నారు.