అనంతలో అదురు : భూప్రకంపనలు

ఉరవకొండ : అనంతపురం జిల్లాలో మార్చి 10 తెల్లవారుజామున స్వల్పంగా భూప్రకకంపనలు సంభవించాయి.ఉరవకొండ మండలం అమిద్యాలలో రాత్రి 12.45 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రతకు పలు గృహాలకు తీవ్రమైన పగుళ్లు వచ్చాయని గ్రామస్థులు తెలిపారు.
అర్థరాత్రి పూట సంభవించిన ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లన్నీ కొద్దిసేపు ఊగిపోవడంతో రాత్రంతా ఇళ్ల నుంచి బైటకు వచ్చేసి..ఆరుబైటే పడిగాపులు కాశారు.గతకొంతకాలంగా ఇలాంటి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. అర్ధరాత్రి పెద్ద శబ్దంతో ఈ ప్రకంపనలు వచ్చాయన్నారు. కాగా దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు..