ఏపీలో 12 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేళ నిర్లక్షంగా వ్యవహరించిన ఉద్యోగులపై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖ, మండపేట, కోవూరు, సూళ్లూరుపేట, నూజివీడు ఆర్వో, ఏఆర్వోపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోల సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ 12 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన మరికొందరు అధికారులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.