హాట్ కామెంట్స్ : పవన్‌పై విమర్శలు చేయనన్న ఉండవల్లి 

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 03:17 PM IST
హాట్ కామెంట్స్ : పవన్‌పై విమర్శలు చేయనన్న ఉండవల్లి 

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తాను విమర్శలు చేయనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు అపారమైన గౌరవం ఇచ్చారని, ఆయనపై ఎలాంటి కామెంట్ చేయను అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పట్ల ఆదరణ చాలా బాగుందని.. మూడు నెలల్లో మాత్రం ఏదైనా జరగవచ్చని వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ ఎలా ఉంది ? తదితర విషయాలు చర్చించేందుకు ఉండవల్లితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సూటిగా స్పందించారు.

జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతమైందని…అయితే..వైఎస్సార్ పాదయాత్రకు…జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు. సీఎం పదవి కోసం పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదన్న ఉండవల్లి…టీడీపీతో కలవరని అనుకుంటున్నట్లు చెప్పారు. బాబుతో కలిసినా పవన్‌కు ఉపయోగం ఉండని అనుకుంటున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బాబు అధికారంలోకి రాలేరని..అయినా బాబును మాత్రం తక్కువ అంచనా వేయవద్దన్నారు. ఇంకా ఆయన ఎలాంటి విషయాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.