పోలీస్ వలయంలో రాజధాని గ్రామాలు : ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నాయి. నిడమర్రులో ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి చేశారు.

ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నాయి. నిడమర్రులో ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి చేశారు.
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నాయి. ఓ వైపు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం…మరోవైపు ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆందోళనలు..వాటిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా అమరావతిలో ఖాకీల కవాతు..దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియని పరిస్థితి నెలకొంది.
నిడమర్రులో ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. తమ ఆందోళనకు మద్దతు ప్రకటించకపోవడంతోపాటు కాలేజీ బంద్ చేయలేదనే కారణంతో దాడికి దిగారు. రాళ్లతో బస్సు అద్దాలను పగులగొట్టారు. ఏపీ కేబినెట్ దృష్ట్యాం ప్రకాశం బ్యారేజీ వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పంపిస్తున్నారు. రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో సాధారణ ప్రజల రాకపోకలకు కూడా ఆంక్షలు విధించారు.
కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏ రకంగా ఉంటుందోనని అన్న దాతల్లో ఆందోళన కొనసాగుతుండగా సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని చర్యలు చేపట్టారు. సీఎం, మంత్రుల వాహనాలను అడ్డుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసిన టెన్షన్.. టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతం మార్పు ప్రకటన వెలువడే వేళ అమరావతి రాజధాని ప్రాంతంలో టెన్షన్ నెలకొంది.
రాజధాని గ్రామాల్లో టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లతోపాటు అగ్నిమాపక దళాలలను మోహరించారు. 29 గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లతోపాటు సరిహద్దుల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. మందడంలో నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు తుళ్లూరు ప్రాంతంలో మాత్రం శాంతియుత నిరసనలకు అనుమతి ఇచ్చారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సచివాలయానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రానున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా ముందస్తుగా సచివాలయం చుట్టూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సచివాలయానికి వెళ్లే రహదారులను పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. మందడం నుంచి సచివాలయం వెళ్లే దారిలో ఆంక్షలు విధించారు. ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.తుళ్లూరు-సచివాలయం మధ్య దాదాపు 700 మంది పోలీసులు మోహరించారు. మందడం, మల్కాపురం జంక్షన్ దగ్గర భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
కేబినెట్ సమావేశం ముగిసే వరకు పోలీసు బలగాలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ సమావేశం సమయంలో మంత్రుల రాకపోకల సమయంలో వారి వాహనాలను రైతులు అడ్డుకునే అవకాశం ఉంది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. పరో రోజు ఆందోళనలో భాగంగా అమరావతి రైతులు నిరసనకు దిగారు.