పెళ్లింట విషాదం : కూతురి పెళ్లి ఊరేగింపులో తండ్రి మృతి
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురు వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ మృతి చెందాడు. ఆర్టీఏ ఏజెంట్‌గా పనిచేస్తున్న మేకల దాసు… తన పెద్ద కూతురు పెళ్లిని వైభవంగా జరిపించాడు. రాత్రిపూట పెళ్లి ఊరేగింపు ఏర్పాటు చేశాడు.
అందరూ సంతోషంగా నృత్యాలు చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకూ ఎంతో ఆనందంగా ఊరేగింపులో ముందుకు సాగుతున్నారు. బంధువుల ఒత్తిడితో… దాసు కూడా స్టెప్పులేశాడు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో… అతడు సడెన్‌గా కిందపడిపోయాడు.
వెంటనే కుటుంబీకులు అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయారని డాక్టర్లు తేల్చారు. ఈ ఘటనతో సంతోషంగా ఉన్నవారంతా విషాదంలో మునిగిపోయారు.