గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 13 మృతదేహాలు లభ్యం
గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా

గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా
గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ(సెప్టెంబర్ 17,2019) మరో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద స్థలమైన కచ్చులూరులో 3 మృతదేహాలు దొరికాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు సమీపంలో 2 మృతదేహాలను గుర్తించారు. ఈ మృతదేహాలు ప్రమాదం జరిగిన మూడు కిలోమీటర్ల దూరంలోని ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.
ధవళేశ్వరం దగ్గర రెండు, పోలవరం మహా నందీశ్వరస్వామి ఆలయం దగ్గర మరో రెండు, పోలవరం కాపర్ డ్యామ్ దగ్గర ఓ మృతదేహం లభ్యమయ్యాయి. కొత్తపట్టిసీమ, తాళ్లపూడి దగ్గర 3 మృతదేహాలను గుర్తించారు. నదిలో నుంచి మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. వాటిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. మిగతా మృతదేహాల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంటూరు సమీపంలో లభ్యమైన 2 మృతదేహాలలో ఒకరిని గుర్తించారు. ఐడీ కార్డుల ఆధారంగా… అతడిని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని ఆకెళ్ల వారి స్ట్రీట్‌కు చెందిన గన్నబత్తుల బీఎస్ ఫణికుమార్‌గా గుర్తించారు. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎంతోపాటు పలు కార్డుల ఆధారంగా గుర్తించారు.
గోదావరిలో ప్రమాద స్థలంలో 3వ రోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 600 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం వరకు గోదావరిని జల్లెడపడుతున్నారు. బోటు జాడ కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. నీటిపై తేలుతున్న ఆయిల్ తెట్టు ఆధారంగా కచ్చులూరు సమీపంలో బోటు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అంచనా వేసింది. బోటు ఉన్న ప్రాంతంలో 270 నుంచి 315 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. సోమవారం(సెప్టెంబర్ 16,2019) నాలుగు మృతదేహాలు లభించాయి. మిగతా వారికోసం NDRF, SDRF, నేవీ బృందాలు గోదావరిని జల్లెడపడతున్నాయి. బోటు కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశముందని రెస్క్యూ టీమ్ చెబుతోంది.