గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం

గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 02:53 AM IST
గోదావరి బోటు ప్రమాదం : 3వ రోజు 4 మృతదేహాలు లభ్యం

Updated On : September 17, 2019 / 2:53 AM IST

గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో

గోదావరి పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17, 2019) పోలవరం, కొత్తపట్టిసీమ, తాళ్లపూడి దగ్గర 4 మృతదేహాలు గుర్తించారు. వాటిని బయటకు తియ్యడానికి  సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర టూరిస్ట్ బోటు ప్రమాదానికి గురైంది. మూడో రోజూ గాలింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు నేవీకి చెందిన వారు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో సుడులు ఎక్కువగా ఉండటం వల్ల గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాయల్ వశిష్ట బోటు జాడ కోసం ఉత్తరాఖండ్ కి చెందిన 30మంది సభ్యుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి నదిలో గాలిస్తున్నారు. బోటు జాడ కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. నీటిపై తేలుతున్న ఆయిల్ తెట్టు ఆధారంగా కచ్చులూరు సమీపంలో బోటు ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అంచనా వేసింది. బోటు ఉన్న ప్రాంతంలో 270 నుంచి 315 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. గాలింపు చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. సోమవారం(సెప్టెంబర్ 16,2019) నాలుగు మృతదేహాలు లభించాయి. మిగతా వారికోసం NDRF, SDRF, నేవీ బృందాలు గోదావరిని జల్లెడపడతున్నాయి. బోటు కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశముందని రెస్క్యూ టీమ్ చెబుతోంది.