ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 08:44 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Updated On : November 15, 2019 / 8:44 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  కాగా..ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం (నవంబర్ 15)న విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరిస్తూ…స్టేకు ఇచ్చేందుకు నిరాకరించింది. 

అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై హైకోర్టులో పలువురు  పిటీషన్  దాఖలు చేశారు. వీటిపై విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన హైకోర్టు..ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇప్పటికే పదవీ కాలం పూర్తయిన సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.