భారతీయ రైల్వే తొలి ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ : చేత్తో ముట్టుకోనక్కర్లా..కరోనా రాదు

కరోనా..మనిషి జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, ఏది తినాలి, ఎలా ఉండాన్నా..ఇలా అన్ని విషయంలో ఆచి తూచి అడుగేయాల్సి వస్తోంది. మనుషుల జీవితంలో పెను మార్పులకు నాంది పలికింది కోరోనా వైరస్. ఈ మార్పుల్లో భాగంగానే భారతీయ రైల్వే కూడా కరోనా రహిత రైలు కోచ్ ను రూపొందించింది. అదే ‘పోస్ట్ కోవిడ్ కోచ్’
ఇది దేశంలోనే మొట్టమొదటి ‘పోస్ట్ కోవిడ్ కోచ్’, ఈ రైల్వే కోచ్ మనం రెగ్యులర్‌గా చూస్తున్న రైలు బోగీలా ఉండదు. చాలా డిఫరెంట్. ఈ కోచ్ కరోనాను దరిచేరనివ్వని కోచ్. అంటే చేత్తో ముట్టుకోనక్కర్లేదు. దానికి తగినట్లుగా ఈ కోచ్ ను తయారు చేసింది రైల్వే శాఖ. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలు బోగీ.
కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్నాయి ఈ ‘పోస్ట్ కోవిడ్ కోచ్’లు త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు అంటున్నారు. ఈ ‘పోస్ట్ కోవిడ్ కోచ్’కు సంబంధించి భారతీయ రైల్వే తన అధికారిక ట్విటర్‌లో ఓ వీడియోను పంచుకుంది.
ఈ సరికొత్త ‘పోస్ట్ కోవిడ్ కోచ్’లో అన్నీ ప్రత్యేక సదుపాయాలుంటాయి. చేతితో తాకాల్సిన అవసరం లేకుండా వాష్ బేసిన్ దగ్గర్నుంచి వాష్ రూమ్ వరకు అన్నీ స్పెషలే. వాటర్ ట్యాప్, ఫ్లష్ వాల్వ్ , సోప్ డిస్పెన్సర్, వాష్‌రూమ్ డోర్ వంటివాటిని చేతితో తాకుండా కాలితోనే ఆపరేట్ చేసేలా తయారు చేశారు. హ్యాండిల్స్‌కు ఇదివరకటిలా స్టీల్‌వి కాకుండా కాపర్ కోటింగ్, టైటానియం డయాక్సైడ్ కోటింగ్ ఉంటుంది.
Indian Railways is set to hit the tracks with 1st ‘Post COVID Coach’ to ensure a COVID free journey.
Amenities include:
▪Handsfree
▪Copper-coated handrails & latches
▪Plasmdioxide
▪Titanium di-oxide coatingMore info here: https://t.co/Louq81zQY5 pic.twitter.com/TzRVPT4IoP
— Ministry of Railways (@RailMinIndia) July 14, 2020
ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తులు వాటిని తాకినా వైరస్ కొన్ని గంటల్లో అది చనిపోతుంది. కాపర్‌కు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక ఏసీ కోచ్‌లో ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. గాలిలో, ఉపరితలాలపై క్రిములను నాశనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాగా, ఈ రైలు బోగీలు అందుబాటులోకి వస్తే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.