జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా : జగన్
రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రకాశం : రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఫీజులు, కరెంట్ ఛార్జీలు పెరుగుతాయన్నారు. ఇసుక లారీ ధర రూ.లక్షకు పెరుగుతుందని తెలిపారు. చంద్రబాబు కొండలు, గుట్టలు, పొలాలు అన్నీ దోచేస్తారని చెప్పారు. దర్శిలో ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు.
Read Also : రీఛార్జ్ చేసుకోండి : జియో.. బెస్ట్ 4G Data ప్లాన్స్ ఇవే
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచిత ఉద్యోగాలుండవన్నారు. సీబీఐని ఏపీకి రానివ్వడని తెలిపారు. చంద్రబాబును వ్యతిరేకించేవారిని వదిలిపెట్టడని చెప్పారు. బీసీ జడ్జీలను నియమించొద్దని కొలీజియంకు లేఖలు రాశారని వెల్లడించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు డ్వాక్రా రుణాలు ఉండవని, పంటలకు గిట్టుబాటు ధర ఉండదని చెప్పారు.
1994లో మద్యపాన నిషేధం హామీతో ఎన్టీఆర్ టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారని.. 1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను ఎత్తివేశారని గుర్తుచేశారు.
Read Also : క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది