తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

బ్రహ్మాండనాయకుడు..కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిథిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవలు వైభవంగా జరిగాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిచేశారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుండటంతో అప్పటి వరకూ భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు.
సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం (సెప్టెంబర్ 24) ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో బాగంగా వేకువఝాము 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించారు.
అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్తోక్తంగా నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఇక భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుండటంతో అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
సెప్టెంటర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలు 30న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. దీంట్లో భాగంగా శ్రీవారు పలు వాహనాలపై ఊరేగుతు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి సేవలు ఈ రోజుల్లో ఇలా..
-సెప్టెంబర్ 30న రాత్రి పెదశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు
– అక్టోబర్ 1న చినశేష, హంస వాహనంపై ఊరేగింపు
– 2 స్వామివారికి సింహ, ముత్యపు పందిరి వాహన సేవలు
– 3వ తేదీన కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు
– 4వ తేదీన హోహిని అవతారం, గరుడ వాహన సేవలు
– 5వ తేదీన హనుమంత, గజవాహన సేవలు
– 6వ తేదీన సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు
– 7వ తేదీన రథోత్సవం, అశ్వవాహన సేవ
– 8వ తేదీన జరిగే చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.