కరోనాను వదలని సైబర్ నేరగాళ్లు: ఈ లింక్‌లు ఓపెన్ చేస్తే అకౌంట్లలో డబ్బులు మాయం

  • Published By: vamsi ,Published On : March 28, 2020 / 04:25 AM IST
కరోనాను వదలని సైబర్ నేరగాళ్లు: ఈ లింక్‌లు ఓపెన్ చేస్తే అకౌంట్లలో డబ్బులు మాయం

Updated On : March 28, 2020 / 4:25 AM IST

అంతర్జాలంలో నేరాలు చేసేవాళ్లకు టైమ్‌తో పనిలేదు. ఏది ట్రెండింగ్‌లో ఉన్నా కూడా దానిని క్యాష్ చేసేసుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌‌ను కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తమ తప్పుడు పనులకు వాడుకుంటున్నారు.

దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో మేజారిటీ ప్రజలు నెట్టింట్లో ఎక్కువగా గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడేందుకు ఎక్కువగా గూగుల్‌లో వెతుకుతున్నారు. అందుకు సంబంధించిన ఆర్టికల్స్‌ను చదివి అవగాహన పెంచుకుంటున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వెయ్యడానికి ఉపయోగపడుతుంది. 

కరోనా వైరస్ పేరుతో బ్యాంకు ఖాతాలను ట్రేస్ చేసి హ్యక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మెయిల్, బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన వాటిని హ్యాక్‌ చేసేందుకు కరోనా వైరస్‌ పేరుతో వెబ్‌సైట్‌లు రూపొందించి వల వేస్తున్నారు. ఈ విషయాన్ని కర్నూల్ ఎస్పీ పకీరప్ప వెల్లడించారు. పదుల సంఖ్యలో కరోనా వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తున్నాయని వాటిని సైబర్‌ క్రైం పోలీస్‌లు గుర్తించినట్లు చెప్పారు.

coronavirursstatus(.)space, coro navirus(.)zone, coronavir s-realtime(.com) bgvfr.coro navirusaware(.)xyz  ఇవి చాలా డేంజరస్‌ డొమైన్స్‌ అని వీటిని క్లిక్‌ చేయవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ అలర్ట్‌ వెబ్‌సైట్లు అసలు ఓపెన్‌ చేయొద్దని సూచనలు చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే సైబర్‌  ల్యాబ్‌ పోలీస్‌లకు గాని, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9121211100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.