జనసేన లాంగ్ మార్చ్ కు వామపక్షాలు దూరం
జనసేనకు వామపక్ష పార్టీలు ఝలక్ ఇచ్చాయి. జనసేన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.

జనసేనకు వామపక్ష పార్టీలు ఝలక్ ఇచ్చాయి. జనసేన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.
జనసేనకు వామపక్ష పార్టీలు ఝలక్ ఇచ్చాయి. జనసేన లాంగ్ మార్చ్ కు దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం (నవంబర్3, 2019) నిర్వహించబోయే ర్యాలీలో పాల్గొనడం లేదంటూ సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పట్ల వామపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి. పవన్ ఏకపక్ష విధానాలను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికల సమయంలో సీట్ల పంపకం విషయంలో అభ్యర్థులను పవన్ ఏకపక్షంగా ప్రకటించారని లెఫ్ట్ నేతలు వాపోయారు. నూజివీడులో సీపీఎంకు కేటాయించిన తర్వాత జనసేన అభ్యర్థి మార్పు చేసింది. విజయవాడ పార్లమెంటుకు కూడా చివరి నిమిషంలో పవన్ అభ్యర్థిని ప్రకటించడాన్ని లెఫ్ట్ పార్టీలు తప్పుబట్టాయి. మొత్తం మీద జనసేనకు, లెఫ్ట్ పార్టీలకు పోలింగ్ కు ముందే గ్యాప్ వచ్చినట్లు కనపడుతోంది.
పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు తొలుత అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. విశాఖ సెంట్రల్ పార్క్ దగ్గర జనసేన నేతలు చేస్తున్న ఏర్పాట్లను అధికారులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అధికారులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆదివారం(నవంబర్ 3, 2019) విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీలో ఇసుక సంక్షోభంపై లాంగ్ మార్చ్ కు జనసేనాని పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నిర్మాణరంగ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ రంగ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించాలని పవన్ నిర్ణయించారు.
భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై నిరసన గళం విప్పిన జనసేనాని లాంగ్ మార్చ్ పేరిట భారీ నిరసన ప్రదర్శనను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ లాంగ్ మార్చ్ కు టీడీపీ ఇప్పటికే సపోర్ట్ చేసింది. తమ పార్టీ ముఖ్య నేతలు మార్చ్ లో పాల్గొంటారని చంద్రబాబు ప్రకటించారు.