EC తీరుపై ట్విట్టర్ లో లోకేశ్ 

కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 11:41 AM IST
EC తీరుపై ట్విట్టర్ లో లోకేశ్ 

Updated On : April 10, 2019 / 11:41 AM IST

కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అమరావతి : కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీడీపీ ఎన్ని  ఫిర్యాదులను పట్టించుకోని ఈసీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసిన ఆరోపణలపై మాత్రం అతిగా స్పందిస్తోందని విమర్శించారు. ఎన్నికల నియమావళిని ఎన్నికల కమిషన్ విస్మరిస్తోందని విమర్శించారు.  
Read Also : ధర్నాలతో బాబు డ్రామాలు : ఈసీకి బీజేపీ ఫిర్యాదు

టీడీపీ అభ్యర్థులు, నాయకులు,మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరగటం దేని సంకేతమని..ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ జరగుతున్నాయని లోకేశ్ ప్రశ్నించారు.  ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎన్నికల సంఘం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు మంత్రి లోకేశ్.