నిజంగా చేస్తారా: ‘లిక్కర్ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి’

నిజంగా చేస్తారా: ‘లిక్కర్ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి’

Updated On : October 6, 2019 / 10:53 AM IST

లిక్కర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలనేది రూల్ కాదు. ఓ డిమాండ్ మాత్రమే. విశాఖపట్టణానికి చెందిన ఓ ఎన్జీవో ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం లిక్కర్ ఎంత అమ్ముతోంది. ఒక్కొక్కరు ఎంత తాగుతున్నారనేది తెలుసుకోవచ్చనేది ఆమె అభిప్రాయం. 

ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్జీవో చైతన్య స్రవంతి డా.శిరిన్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ‘ప్రజలు వినియోగించుకునే లిక్కర్‌ను గణాంకాలతో సహా కనుగొనవచ్చు. దాంతో పాటు వినియోగదారులను బట్టి మద్యం తీసుకునేవారికి దాని వల్ల వచ్చే చెడు ప్రభావాల గురించి తెలియజేయవచ్చు’ అని తెలిపారు. 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేదంలో తొలి దశను మొదలుపెట్టినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆధార్‌ ఆధారంగా లిక్కర్ అమ్మకాలు జరగాలని కోరారు. మద్యపాన నిషేదాన్ని అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని విన్నవించారు. దీనిపై కేంద్రప్రభుత్వం కూడా ఓ సారి ఆలోచించాలని అన్నారు.