తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్.. కరోనా వారియర్‌గా సేవలు

ఈ శాన్య రాష్ట్రాల్లో తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా పేరు పొందారు డాక్టర్ బీన్సీ లైష్రామ్. మణిపూర్ ఇంఫాల్‌లోని శిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా బీన్సీ లైష్రామ్ సేవలందిస్తున్నారు. కరోనా వారియర్ గా విశేష సేవలందిస్తోంది బీన్సీ లైష్రామ్. ఈ సందర్భంగా డాక్టర్ బ్రియాన్సీ మాట్లాడుతూ..తాను డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో అవమానాలకు ఎదుర్కొన్నాననీ..కానీ..ఈ హాస్పిటల్ లో మాత్రం నర్సులు, డాక్టర్ల నుంచి తనకు మంచి సపోర్టు ఉందని.. సహోద్యోగులు అందరూ తనతో స్నేహంగా ఉంటున్నారని బియాన్సీ ఆనందం వ్యక్తం చేస్తోంది.
మెడిసిన్ చదివే రోజుల్లో కొన్ని అవమానాలు ఎదుర్కోక తప్పలేదని కానీ నా కలను సాకారం చేసుకోవాలనే పట్టుదల ముందు అవి చాలా చాలా చిన్నవి..అందుకే వాటిని పట్టించుకోలేదని..డాక్టర్ కావాలని నా చిన్ననాటి కల నాకలను నెరవేర్చునేందునే నేను ఆ లక్ష్యం దిశగా నేను నడిచాను..నా కలను నిజం చేసుకున్నానని తెలిపారు బీన్సీ.
రోగులకు సేవలు చేయటంలో కలిగే ఆనందం ముందు ఎటువంటి అవమానాలు వచ్చిన అవి ఏపాటివి..పైగా అవి స్వల్పమైనవి అని తేలిగ్గా కొట్టిపారేశారామె. కరోనా కాలంలో డాక్టర్లు ఉన్నారనే రోగుల నమ్మకాన్ని నిజం చేయటానికి ఎంత కష్టమైన సహిస్తానని చెప్పారు డాక్టర్ బీన్సీ.
నేను పుట్టినప్పుడు అబ్బాయిగానే పుట్టాను..అప్పుడు నా పేరు బోబోయి లైష్రామ్. కానీ 9,10 క్లాసులకు వచ్చేసరికి నా శరీరంలో మార్పులు రావటంతో మా ఇంట్లో వాళ్లంతా నన్ను అసహ్యించుకునేవారు..నా కన్నతండ్రే నన్ను చంపాలని చూశాడు.. దీంతో కన్నవాళ్లే చంపాలని చూస్తే నేనేమైపోవాలి..డాక్టర్ కావాలనే నాకలను ఎలా నిజం చేసుకోవాలి? నాకల నెరవేరదా? అని తల్లడిల్లిపోయాను. కానీ డాక్టర్ అయి తీరాలనే నా కలను నెరవేర్చుకోవటానికి ఎంతో కష్టపడ్డాను. పుదుచ్చేరిలో ఆపరేషన్ చేయించుకుని పూర్తి స్త్రీగా మారిపోయాను.
ఆ తరువాత సమాజం నన్ను పోస్ట్ -ఆపరేటివ్ ట్రాన్ ఉమెన్ గా గుర్తించిందని తెలిపింది. మనిషిగా పుట్టిన అందరూ సమానమే..జెండర్ ను బట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పటం ఏ మాత్రం న్యాయం కాదని అన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ బిన్సీ లైష్రామ్.
డాక్టర్ బిన్సీ లైష్రామ్ గురించి శిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్.. ప్రముఖ సర్జన్ సోరోఖైబామ్ జుగింద్ర మాట్లాడుతూ..ఈ హాస్పిటల్ లో ఆమెను డాక్టర్ గా నియమించుకోవటానికి మేమే ఏమాత్రం ఆలోచించలేదనీ..ఆమె ఒక డాక్టర్ గా మాత్రమే చూశామని తెలిపారు. తన సేవలతో పలు అవార్డులు గెలుచుకున్న బీన్సీ ఎంతో అంకిత భావంతో పనిచేస్తుంటారని..అస్సలు ఏమాత్రం విశ్రాంతి అనేది ఆమె తీసుకోకుండా రోగులకు సేవలు చేయటంలో ఆమె స్ఫూర్తి అని తెలిపారు.
కాగా..పురుషులతో పాటు మహిళలు అన్నీ రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ క్రమంలో జెండర్ అనే పదానికి మరో రెండు అక్షరాలు తోడైతే..వారే ట్రాన్స్ జెండర్లు. వారు కూడా ప్రతిభ నిరూపించుకోవటానికి అడుగులు వేస్తున్న క్రమంలో పోరాటాలూ చేస్తున్నారు. కానీ జెండర్ ఏదైనా ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అదే నిరూపించారు డాక్టర్ బిన్సీ లైష్రామ్.ఎన్నో అవమానాలను ఎదుర్కొంటు డాక్టర్ అవ్వాలన తన కలను సాకారం చేసుకున్నారు. కరోనా వారియర్ గా వైద్య సేవలందిస్తూ డాక్టర్లందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.