ఏం జరిగింది : ఇంట్లో మంటలు..తల్లీ కొడుకు సజీవ దహనం

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 05:19 AM IST
ఏం జరిగింది : ఇంట్లో మంటలు..తల్లీ కొడుకు సజీవ దహనం

Updated On : September 14, 2019 / 5:19 AM IST

గుంటూరు జిల్లా పిడుగురరాళ్ల మండలం ఆదర్శ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. శనివారం (సెప్టెంబర్ 14) ఉదయం  ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు సజీవంగా దహనమైపోయారు. తల్లి షేక్ జాంబి, కుమారుడు మౌలాలి ఈ ప్రమాదానికి బలైపోయారు. 

షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం సంభవించినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనతరం తల్లీ కుమారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా స్థానికులను ప్రశ్నించారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.