జగన్ అన్నా హ్యాట్సాఫ్.. టీడీపీ ఎంపీ ట్వీట్!

  • Published By: vamsi ,Published On : December 24, 2019 / 04:43 AM IST
జగన్ అన్నా హ్యాట్సాఫ్.. టీడీపీ ఎంపీ ట్వీట్!

Updated On : December 24, 2019 / 4:43 AM IST

దేశ వ్యాప్తంగా CAA, NRC వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ NRC బిల్లుకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ కడప జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు.

అయితే జగన్ చేసిన ప్రకటనపై లేటెస్ట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్‌పై తెలుగుదేశం ఎంపీ కేశినేని నానీ సెటైర్లు వేశారు. జగన్ అన్న నువ్వు సూపర్ అంటూ ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నానీ, రోజుకో ట్వీట్‌తో విరుచుకుపడుతున్నారు. లేటెస్ట్‌గా ఎన్‌ఆర్సీని జగన్ వ్యతిరేకించడంపై నానీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

జగనన్న నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో CABకు అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం NRCకి వ్యతిరేకం అంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న. హ్యాట్సాఫ్ అన్నా అంటూ ఎద్దేవా చేశారు.

అలాగే అమరావతిని ఎడారితో పోల్చిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కూడా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో టార్గెట్ చేశారు. అమెరికాలో లాస్ వేగాస్ నగరాన్ని ఏడారిలోనే నిర్మించారని.. ఒకసారి అక్కడికి వెళ్లి చూసి రా నాయనా అంటూ సలహా ఇచ్చారు. ఎడారిలో కూడా అద్భుతాలు ఎలా సృష్టించ వచ్చో తెలుస్తుందని అన్నారు.