లారీని ఢీ కొట్టినప్పుడే పట్టుకొని ఉంటే…ఇప్పుడు నలుగురు బతికేవాళ్ళు

Mumbai: Car accident in Crawford : ముంబైలో మూతపడిన షాపులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అంతలోనే ముంబైలో ఊహించని ప్రమాదం జరిగి నాలుగు ప్రాణాలు బలైపోయాయి. ఓ కారు సష్టించిన పెను బీభత్సానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్ పాత్ మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఫుట్ పాత్ పై నడుస్తున్న నలుగురు పాదచారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రాఫోర్డ్ మార్కెట్ ఏరియా ప్రాంతంలో ఉన్న జనతా కేఫ్ వద్ద సోమవారం (ఆగస్టు 31,2020) రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనతో అక్కడి జనం భయాందోళనలకు గురయ్యారు.
సమీర్ డిగ్గి అనే వ్యక్తి కారును చాలా ఫాస్టు గా డ్రైవ్ చేసుకుంటూ రావటంతో అది కాస్తా కంట్రోల్ తప్పి ఫుట్‌పాత్ పైకి ఎక్కి మరీ గోడను కొట్టింది. అక్కడే ఉన్న జనంపైకి దూసుకెళ్లడంతో నలుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటంతో జేజే ఆస్పత్రికి తరలించారు.
https://10tv.in/man-hit-by-car-dragged-on-bonnet-in-delhi-vikaspuri-2-accused-arrest/
ఈ ప్రమాదానికి కారణమైన కారు తుక్కుతుక్కైంది. దీంతో కొంతసేపు ఆ ప్రాంతం అంతా భీతాహంగా మారిపోయింది. కాగా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఇటీవల కూడా ఓ లారీని ఢీ కొట్టారని పోలీసులు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా కారు డ్రైవర్ సమీర్ డిగ్గీ గత మూడు నెలల క్రితం కూడా ఓ ప్రమాదం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా..ప్రమాదంలో చనిపోయిన మృతులు సరోజా నాయుడు (65), జుబేదా అబ్దుల్ ఖాన్ (60), సైరా బాను (60), మొహమ్మద్ నయీమ్ (55) గా గుర్తించారు. గాయపడిన నలుగురితో పాటు కారు డ్రైవర్ డిగ్గీ జెజె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.