చిన్నారి ద్వారక హత్య కేసులో ట్విస్టులు: నిందితుడ్ని ఉరి తీయమంటున్న భార్య

విజయవాడ భవానీపురం చిన్నారి ద్వారక హత్య కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ జరిగేకొద్దీ కొత్త కోణాలు బైటపడుతున్నాయి. పక్కింటి ప్రకాశ్ అలియాస్ పెంటయ్యతో చిన్నారి ద్వారక తల్లికి వివాహేతర సంబంధం ఉండటం..వారిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసిన ద్వారకను ప్రకాశ్ తో కలిసి తల్లి వెంకటమ్మ చంపించిందని పోలీసులు విచారణలో తేలాయంటూ వచ్చిన వార్తలపై ద్వారక తండ్రి అనిల్..తల్లి వెంకట రమణ మండిపడ్డారు. తాము బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉంటే మాపై ఇటువంటి నిందలు వేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రకాశ్ ను నమ్మొద్దు నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు: ద్వారక తల్లి
ఈ హత్య కేసునుంచి తప్పించుకోవటానికి ప్రకాశ్ అబద్దాలు చెబుతున్నాడనీ..తన భార్య వెంకట రమణకు ప్రకాశ్ కు ఎటువంటి సంబంధంలేదని అనిల్ అంటున్నాడు. తప్పించుకోవటానికి ప్రకాశ్ తనపై నిందలు వేస్తున్నాడనీ..ప్రశాశ్ భార్య సునీత..తాను కలిసే ప్రతీ రోజు పనికి పోతామని ఉదయం పోయి సాయంత్రం వస్తామని ఇదంతా ప్రకాశ్ అబద్దాలు ఆడుతున్నాడని తన బిడ్డను చంపిన వాడిని ఉరి తీయాలని ఆవేదనతో తెలిపింది.
నా భర్తను ఉరి తీయండి : నిందితుడు ప్రకాశ్ భార్య సునీత
మరోపక్క ప్రకాశ్ భార్య సునీత కూడా తన భర్త దుర్మార్గుడనీ..మారతాడనే ఆశ తనకు ఇప్పటి వరకూ ఉండేదనీ..కానీ చిన్నారి ద్వారకను చంపిన తన భర్త ప్రకాశ్ ను వెంటనే ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాగా చిన్నారి ద్వారకను చంపి ఏమీ తెలియనట్లుగా మీడియా ముందు మొసలు కన్నీరు కురిపించాడని ఇదంతా తప్పించుకోవటానికి ప్రకాశ్ ఆడుతున్న నాటకమనీ ఇవన్నీ నమ్మవద్దని తమకు న్యాయం చేయాలని ద్వారక తల్లిదండ్రులు అనిల్, వెంకట రమణ డిమాండ్ చేస్తున్నాడు. తమ కుటుంబంపై ప్రకాశ్ పగబట్టి తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు. చిన్నారిని దారుణంగా హత్య చేసిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోను విడిచిపెట్టవద్దని కఠిన శిక్ష వేయాలని ఆవేదనతో డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ప్రశాక్ భార్యే తన బిడ్డ శవం తమ ఇంట్లో ఉందని చెప్పేంత వరకూ తమకు బిడ్డ హత్యకు గురైందనే విషయమే తెలీదని అంటున్నారు.
వీడియో రికార్డుతో ద్వారక పోస్ట్ మార్టం
కాగా..చిన్నారి ద్వారకపై ప్రకాశ్ అత్యాచారం చేసి తరువాత హత్య చేసాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం (నవంబర్ 12)సాయంత్రం ద్వారక మృతదేహానికి వీడియో రికార్డు ద్వారా పోస్ట్ మార్టం జరగనుంది. డాక్టర్ రావటం ఆలస్యం కావటంతో పోస్ట్ మార్టం కొద్దిగా ఆలస్యం కానుంది.
నిందితుడు ప్రకాశ్ నేర చరిత్ర
నిందితుడు ప్రకాశ్ కు నేర చరిత్ర ఉంది. కొన్నేళ్ల క్రితం మూగ బాలికపై అత్యాచారం చేసిన కేసులో 11 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. అతడిపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.దీంతో ఆ దిశగా విచారణ చేపట్టగా ప్రకాశే హత్య చేసినట్లుగా తేలింది. కానీ ద్వారక తల్లితో తనకు వివాహేతర సంబంధం ఉందని అది ద్వారకకు తెలియటంతో భయపడి తనను ద్వారకను చంపేయమని తల్లి వెంకటరమణ అన్నదని అందుకే చంపేశానని చెబుతున్నాడు ప్రకాశ్.
నవంబర్ 10న అదృశ్యమైన ద్వారక..
నవంబర్ 10న నల్లకుంటలో అదృశ్యమైన ద్వారక.. ఆ తర్వాత హత్యకు గురైంది. ద్వారక పక్కింట్లో ఉంటున్న ప్రకాశ్ నివాసంలో మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో పలు మలుపులు తిరుగుతున్న ద్వారక కేసు విషయం పోస్ట్ మార్టం అనంతరం మరింత సమచారం తెలియనుంది.
మొవ్వ అనిల్, వెంకట రమణ భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో పనిచేస్తుండగా.. వెంకటరమణ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్వీపర్‌గా పని చేస్తోంది. ఇద్దరు అబ్బాయిల ను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది. స్థానిక స్కూల్ లో 2వ తరగతి చదువుతోంది. వీరి పక్కింట్లో పెంటయ్య అలియాస్ ప్రకాష్ తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అదృశ్యమైన ద్వారక హత్యకు గురవ్వటం..అది ప్రకాశే చంపాడని తేలింది.