తిరుపతిలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

తిరుపతి : డాక్టర్ పై నర్స్ యాసిడ్ దాడికి పాల్పడింది. సాక్షాత్తు కోర్టు ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. దాడిలో డాక్టర్ గాయాలతో బైటపడగా.. దాడి తర్వాత సదరు మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మిగిలిన యాసిడ్ తాగేసింది. పోలీసులు అమెను ఆస్పత్రికి తరలించారు. ప్రేమతో వ్యవహారంతోపాటు ఆర్థిక విషయాలు కూడా ఈ దాడి వెనక ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. విచారణ చేస్తున్నారు.
తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఆదర్శ్‌రెడ్డికి.. అక్కడే నర్స్ గా విధులు నిర్వహిస్తున్న అరుణకుమారికి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత వారు విడిపోయారు. మధ్యలో గొడవలు జరిగాయి. డాక్టర్ ఆదర్శ్ రెడ్డి.. ప్రేమ పేరుతో మోసం చేశాడని కోపం పెంచుకుంది. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నర్సు అరుణకుమారి బురఖాలో వచ్చి ఆదర్శరెడ్డిపై యాసిడ్ దాడికి దిగింది. తీవ్రంగా గాయపడిన డాక్టర్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.