మంటలు,మద్యం బాటిల్స్ తో క్షుద్రపూజల కలకలం

మహబూబ్ నగర్ : క్షుద్ర పూజలు కలకలం రేగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో క్షుద్రపూజలు చేస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పోలీసులకు పట్టించారు. దీంతో పోలీసులకు చిక్కిన సదరు వ్యక్తి ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ ఖాళీ స్థలంలో కూర్చున్న ఓ వ్యక్తి ఎదురుగా కాళిమాత విగ్రహాన్ని పెట్టుకుని..మద్యం బాటిల్స్, ఎముకలు,పుర్రెలు, జంతు కళేబరాలు, నిమ్మకాయలు పెట్టుకుని..చుట్టూతా పుల్లలు పేర్చుకుని మంటలు అంటించుకుని వాటి మధ్యలో కూర్చున్నాడు.
Read Also : మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం
కాళికా మాత తనను ఆవహించిందంటు అర్థరాత్రి సమయంలో నానా హడావిడి చేశాడు. రాత్రి కరెంట్ పోవటంతో మంటల్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం మంటలు కనిపించిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి వాతావరణాన్ని చూసి షాక్ అయ్యారు. ఐదుగురు వ్యక్తులతో కలిసి మంత్రాలు వల్లిస్తు బీతావహంగా అతను చేస్తున్న పూజలను చూసి బెంబేలెత్తిపోయారు. అనంతరం అతడితో పాటు మిగతా ఐదుగురిని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also : జనసేన పంచె రాజకీయం : అప్పుడు పంచెలూడదీస్తా.. ఇప్పుడు పంచెకట్టే గౌరవం