ఏపీ బిజినెస్ రూల్స్ లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఫైళ్లను ఆర్థిక న్యాయశాఖ రెండు రోజుల్లో క్లియర్ చేసేలా సీఎంవో ఆదేశించింది. మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆమోదం తర్వాత 15 రోజుల్లోగా జీవో విడుదల చేయాలన్నారు. జీవోలు ఇవ్వకపోతే సంబంధిత కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో సీఎం హామీలు, ఆదేశాలు, మంత్రివర్గ నిర‍్ణయాలు త్వరితగతిన అమలయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రస్తావిస్తూ శుక్రవారం (అక్టోబర్ 25, 2019) ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా సీఎం హామీల తక్షణ అమలుకై అవుట్ టుడే, మోస్ట్ ఇమ్మీడియేట్, ఇమ్మీడియేట్ అనే మూడు కేటగిరీలుగా విభజించింది.
ఈ క్రమంలో అవుట్ టుడే కేటగిరీ ప్రకారం సీఎం నిర్ణయం తీసుకున్న రోజే జీవో జారీ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మోస్ట్ ఇమ్మీడియేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకుంటే 5 రోజుల్లోగా జీవో జారీ చేయాలి. ఇక ఇమ్మీడియేట్ కేటగిరీలో నిర్ణయం తీసుకున్నట్లైతే 15 రోజుల్లోగా జీవో జారీ కావాలి. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది.