బ్యాలెట్ పేపరు పోలింగ్ కోసం పోరాడుతూనే ఉంటాం : దేవెగౌడ
పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.

పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.
అమరావతి: పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంపై సుప్రీం కోర్టు సోమవారం తీర్పు చెప్పిన సందర్బంగా ఆయన ఏపీ రాజధాని అమరావతి లో మాట్లాడుతూ సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. దేశంలో మోడీ అన్ని వ్యవస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని సీబీఐ, ఈడీ వంటి వ్యవస్ధలను రాజకీయం కోసం వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
“దేశంలో మోడీ హవా తగ్గుతోంది..ఇటీవల జరిగిన వివిధ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది..బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ శక్తులను ఏకతాటి మీదకు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు..అవినీతి రహిత భారత దేశం రావాలి..బీజేపీకి వ్యతిరేకంగా మా కూటమి బలంగా ఉంది.. ప్రత్యామ్నాయం కూడా మా కూటమే.” అని దేవెగౌడ చెప్పారు.
Read Also : BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం
కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన తెలిపారు. ప్రతి ప్రాంతీయ పార్టీ మోడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. “చంద్రబాబును దేశ వ్యాప్తంగా పర్యటించి నాన్-బీజేపీ పార్టీలను కలపాలని సూచించాను. కేంద్రం తీరుకు నిరసనగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చిన చరిత్ర టీడీపీదని, మళ్లీ బాబు అదే పని చేస్తున్నారుని దేవెగౌడ అన్నారు. మధ్య ప్రదేశ్, కర్ణాటకల్లో ప్రత్యర్ధి పార్టీలను బీజేపీ ఇబ్బందులు పెడుతోంది..కర్ణాటకలో 24 చోట్ల ఐటీ దాడులు చేశారు..ఇవాల్టికీ 300 ఐటీ అధికారులను ప్రత్యర్ధి పార్టీలపై ఉసిగొల్పోతోంది బీజేపీ..మమత బెనర్జీని ఇదే విధంగా ఇబ్బందులు పెడుతున్నారు..మోడీ అవలంబిస్తోన్న అప్రజాస్వామ్య విధానాలను సమిష్టిగా ఎదుర్కొంటాం” అని దేవెగౌడ అన్నారు. “ప్రత్యర్ధులంతా అవినీతి పరులు.. తామే సచ్చీలురమనే భావన కలిగించేందుకు మోడీ వ్యవస్ధలను దుర్వినియోగం చేస్తున్నారు”. “మోడీ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తన రాజకీయ జీవితంలో ఇంతవరకూ చూడలేదని” ఆయన చెప్పారు.
“ఏపీ అభివృద్ది విషయంలో చంద్రబాబు రాజీ పడకుండా పని చేస్తున్నారు. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ ప్రధాని అన్నారు. జగన్ వివిధ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని, జగన్ కేసులతో ఇబ్బంది పడుతున్న విషయం నాకే స్వయంగా తెలుసని, ఏపీ అభివృధ్ది కోసం ఈఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
Read Also : జుమ్లా మేనిఫెస్టో : బీజేపీ సంకల్ప్ పత్రపై విపక్షాల విమర్శలు