ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 10:09 AM IST
ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!

వాలెంటైన్స్ డే రోజు ప్రపంచం అంతా వేడుకల్లో మునిగిపోయి ఆనందిస్తారని తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల మాత్రం వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం విధించడం గమనార్హం. ఇరాన్, పాకిస్థాన్ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం వేడుకలను నిషేధించారు.

ఈ సందర్భంగా ఇరాన్ లో ఎక్కడైనా వాలెంటైన్స్ డే వేడుకలను జరిపితే నేరంగా భావిస్తామని చెప్పారు. పోలీసులు రాజధాని టెహ్రాన్ నగరంలోని కాఫీ, ఐస్ క్రీమ్ షాపులకు నోటీసులు జారీ చేశారట. అంతేకాకుండా షాప్స్ లో చేరి వాలెంటైన్స్ డే గిఫ్టులు ఒకరికొకరు ఇచ్చుకోకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఇటు పాకిస్థాన్ లో అయితే ఏకంగా దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్.. పాకిస్తానీలెవరూ వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దని, అది ఇస్లాం సంస్కృతి కాదని పిలుపునివ్వడం గమనార్హం. ఈ సందర్భంగా పశ్చిమ సంస్కృతులను గుడ్డిగా పాటించడం వల్ల ఇస్లాం సంస్కృతి సంప్రదాయాలు నాశనమైపోతాయని, మహిళలపై దాడులతో పాటు మరికోన్ని సమస్యలకు కారణం అవుతాయని ఆ దేశాల అధినేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read : ఈ ఘోరం ఏంటయ్యా : బాలుడిపై ఏడాదిగా మహిళ అత్యాచారం