జనసేన ప్రభుత్వం వస్తే : ఉత్తరాంధ్రలో వలసలు ఆపేస్తా

టీడీపీ, వైపీపీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 10:38 AM IST
జనసేన ప్రభుత్వం వస్తే : ఉత్తరాంధ్రలో వలసలు ఆపేస్తా

Updated On : April 5, 2019 / 10:38 AM IST

టీడీపీ, వైపీపీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తున్నారు.

విజయనగరం : టీడీపీ, వైపీపీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలపై వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. జనసేన ప్రభుత్వం వస్తే.. ఉత్తరాంధ్రలో వలసలు ఆపేలా చర్యలు తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం జనసేన ఓ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.
Read Also : గుడ్ బై… ఇండోర్ ప్రజలపై బాంబు పేల్చిన లోక్ సభ స్పీకర్

ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకొస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పవన్ ప్రకటించారు. జనసేన ప్రభుత్వం వస్తే.. 6 నెలల్లో రాష్ట్రంలో 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జనసేన చీఫ్ పవన్ హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర యాస, భాష, సంస్కృతులంటే నాకు చాలా ఇష్టం అని పవన్ అన్నారు. ఆడపడుచులకు జనసేన అండగా ఉంటుందన్నారు. రేషన్ డీలర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత జనసేనది అని పవన్ చెప్పారు.

పవన్ హామీలు:
* 58ఏళ్లు పైబడిన కళాకారులందరికీ పెన్షన్
* డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
* రామతీర్థం సాగర్ ను భద్రాద్రితో సమానంగా తీర్చిదిద్దుతా
* ప్రతి మండలానికి డిగ్రీ కాలేజీ ఏర్పాటు
* అన్ని నియోజకవర్గాలకు మంచినీటి సరఫరా
* మహిళల కోసం ప్రత్యేక మహిళా బ్యాంకులు
* రేషన్ కు బదులు మహిళల ఖాతాల్లోకి రూ.2,500-రూ.3,500 జమ
* ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయం
* చీర-సారె పథకం ద్వారా రూ. 10 వేల 116 సాయం
* వికలాంగులకు ఇళ్లు
* వడ్డీలేని రుణాలు
* చిరువ్యాపారులకు పావలా వడ్డీ రుణాలు
* 58 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు నెలకు రూ.5వేలు పెన్షన్
Read Also : జనసేన ప్రభుత్వం వస్తే : ఉత్తరాంధ్రలో వలసలు ఆపేస్తా