ప్రభుత్వం శుభవార్త : మరో 7 లక్షల మందికి పెన్షన్లు

2020 జనవరి నుంచి ఏపీలో అదనంగా 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్‌, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త పెన్షనర్ల

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 02:52 AM IST
ప్రభుత్వం శుభవార్త : మరో 7 లక్షల మందికి పెన్షన్లు

Updated On : October 15, 2019 / 2:52 AM IST

2020 జనవరి నుంచి ఏపీలో అదనంగా 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్‌, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త పెన్షనర్ల

2020 జనవరి నుంచి ఏపీలో అదనంగా 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్‌, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త పెన్షనర్ల ఎంపికలో గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను 4 విడతలుగా వారి చేతికే అందిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో మంత్రి చెప్పారు. సోమవారం(అక్టోబర్ 14,2019) విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డీఆర్‌డీఏ పీడీల సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. డీఆర్‌డీఏ పీడీలు ప్రతి నెల 15 రోజులపాటు ఫీల్డ్‌లో పని చేయాలన్నారు. గ్రామీణాభివృద్ది కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలన్నారు.

పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 9.33 లక్షల పొదుపు సంఘాలు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రుణం రూ. 27,168 కోట్లు ఉందని.. రుణభారం నుంచి పొదుపు మహిళలను విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2019 ఏప్రిల్‌ 11వ తేదీలోగా బ్యాంకులకు మహిళలు చెల్లించాల్సిన వడ్డీ రూ.1,823 కోట్లు, రుణభారాన్ని ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. మొదటి 5 నెలల వడ్డీ కింద రూ. 760 ‌కోట్లు నేరుగా రుణ ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు.

సున్నావడ్డీ కింద రూ.5 లక్షలకు లోబడి రుణాలు ఇస్తామన్నారు. ఈ వడ్డీని పొదుపు సంఘాల తరుఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే కేటాయింపులను రూ.900 కోట్లు నుంచి రూ.1800 కోట్లకు పెంచుతామన్నారు. స్త్రీనిధి కింద ఇచ్చే ఆర్థిక తోడ్పాటును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతామన్నారు.