బిగ్ డెవలప్ మెంట్ : యాదాద్రికి IOC టర్మినల్

మల్కాపూర్ : యాదాద్రి జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో స్థానికులకు గొప్ప ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఐవోసి లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్షేత్రస్థాయి పెట్రోలియం స్టోరేజీ, పంపిణీ టర్మినల్‌కు ఎన్విరాల్ మెంట్ శాఖ పరిధిలోని స్పెషలిస్ట్ ల కమిటీ (ఈఏసీ) నుంచి అనుమతి కూడా లభించటంతో ఐవోసీ ఏర్పాటు కానుంది.
యాదాద్రి జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో రూ.570 కోట్ల వ్యయ అంచనాతో ఈ టర్మినల్‌ను ఏర్పాటుకానుంది. 28 ట్యాంకులతో కూడిన ఈ టర్మినల్ కెపాసిటీ 165 మిలియన్ లీటర్లు. ఈఏసీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించగా..ప్రాజెక్టు వ్యయంలో కనీసం 2 శాతం నిధులను కార్పొరేట్ పర్యావరణ బాధ్యత (సీఈఆర్) కోసం కేటాయించాలని.. ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ ప్రణాళికనూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించాలని కమిటీ స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 35 మందికి, పరోక్షంగా 460 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ ప్రణాళికనూ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు..జీవావరణ రిజర్వులు, పులి/ఏనుగు రిజర్వులు, వన్యప్రాణి కారిడార్లు లేవని కూడా కమిటీ స్పష్టం చేయటంతో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను మంజూరు చేసినట్లు తెలియజేసింది. తమ వద్దకు వచ్చిన ప్రధాన ఆందోళనల్లో ఉపాధి, ఆరోగ్య సంబంధిత అంశాలే ఉన్నాయని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పెట్రోలియం ఎక్స్‌పో జీవ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతులూ ఉండా ల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో స్థానికులకు మంచి ఉపాధి లభించనున్న క్రమంలో యాదాద్రి జిల్లా మంచి అభివృద్ది జరగనుంది.