కడప జిల్లాలో డబ్బులు పంచుతున్న 10మంది అరెస్ట్ : రూ.5.84లక్షలు స్వాధీనం

ఎన్నికల పోలింగ్ కు ముందు కడప జిల్లాలో కలకలం చెలరేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఘటన బయటపడింది.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 02:41 AM IST
కడప జిల్లాలో డబ్బులు పంచుతున్న 10మంది అరెస్ట్ : రూ.5.84లక్షలు స్వాధీనం

Updated On : April 9, 2019 / 2:41 AM IST

ఎన్నికల పోలింగ్ కు ముందు కడప జిల్లాలో కలకలం చెలరేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఘటన బయటపడింది.

కడప: ఎన్నికల పోలింగ్ కు ముందు కడప జిల్లాలో కలకలం చెలరేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఘటన బయటపడింది. కడప జిల్లా ఎర్రగుంట్లలో డబ్బులు పంచుతున్న 10మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.84లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు టీడీపీ నేతలకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
Read Also : పోలీస్ స్పెషల్ డ్రైవ్: అక్రమ పార్కింగ్ లకు చెక్

ఏప్రిల్ 11వ తేదీన ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రకటనలు కూడా బంద్ కానున్నాయి. ఆఖరి ప్రయత్నంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కొందరు డబ్బు పంచుతున్నారు, కొందరు మద్యం బాటిళ్లు ఇస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా ఈ పని చేస్తున్నారు. ప్రలోభాల పర్వాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు పక్కా చర్యలు తీసుకున్నారు. పటిష్టమైన నిఘా పెట్టారు. పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వస్తే నేతలు, కార్యకర్తలు, పార్టీల మద్దతుదారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే