ఉద్రిక్తం : చంద్రగిరి నియోజక వర్గంలో కొనసాగుతున్న పోలింగ్:

తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం రామానుజ పల్లిలో పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ బూత్ లోకి వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు కల్పించంతో వారంతా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్న టిడిపి, వైసిపి అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఇద్దరు పోలింగ్ కేంద్రానికి రావటంతో వాతావరణం వేడెక్కింది. ఒకరికొకరు ఎదురు పడి దూషించుకున్నారు. దీంతో వారి వెంట ఉన్నకార్యకర్తలు రెచ్చిపోవటంతో ఘర్షణ జరిగింది. వెంటనే పోలీసుల లాఠీ చార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాయి. గ్రామంలో భారీగా పోలీసులను మొహరించారు.