లాఠీలతో చితక్కొట్టారు: చిన్నారిపై అత్యాచారయత్నం..పట్టుకున్న పోలీసులపై దాడి..

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 09:13 AM IST
లాఠీలతో చితక్కొట్టారు: చిన్నారిపై  అత్యాచారయత్నం..పట్టుకున్న పోలీసులపై దాడి..

Updated On : November 26, 2019 / 9:13 AM IST

చిత్తూరు జిల్లా కలికిలో యువకుడ్ని చావ బాదారు పోలీసులు. రెండు రోజుల క్రితం కొటాల గ్రామామానికి చెందిన  సంవత్సరాల బాలికపై అదే గ్రామంలో ఉంటున్న వీరభద్ర అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు…స్థానికులు వీరభద్రకు దేహశుద్ది చేసి  పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు పింపించారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 

ఈ క్రమంలో పోలీసులు వీరభద్రను విచారించేందుకు గ్రామానికి తీసుకొచ్చారు. వీరభద్రను చూసిన స్థానికుల ఆగ్రహం పెల్లుభికింది. అతడిపై దాడికి దిగారు. వీరభద్ర గ్రామస్తులపై ఎదురు దాడికి దిగాడు. వెంటనే పోలీసులు వీరభద్రను పట్టుకోవటానికి యత్నిస్తుండగా..వారిపై కూడా కొట్టి పారిపోయేందుకు యత్నించాడు. ఎట్టకేలకూ వీరభద్రను పట్టుకున్నారు. దీంతో పోలీసులు కోపం నషాళానికి అంటింది. పసిబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడింది కాకుండా పోలీసులపైనే దాడి చేస్తావా అంటూ  తమదైనశైలిలో చితక్కొట్టారు.  

ఓ కానిస్టేబుల్స్ వీరభద్ర కాళ్లపై బూటు కాలు వేసి తొక్కిపెట్టగా..మరో పోలీస్ లాఠీతో వీరభద్ర అరికాళ్లపై తీవ్రంగా కొట్టాడు. ప్లీజ్ సార్..కొట్టొద్దు సార్..మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను సార్..అంటూ వీరభద్ర కేకలు పెట్టాడు. వీరభద్ర అరిచేకొద్దీ పోలీసులు మరింతగా ఆగ్రహించారు. ముగ్గురు కానిస్టేబుల్ వీరభద్రను వెనకనుంచి చేతులు పట్టుకోగా.. మరో పోలీస్ కానిస్టేబుల్ లాఠీలతో చితకబాదారు. ఇలా వీరభద్ర అత్యుత్సాహానికి పోలీసులు ట్రీట్ మెంట్ అంటే ఏమిటో చూపెట్టారు.