రూ.100కోట్ల కరెన్సీ డంపింగ్ : పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తాం బాబూ

మూడు సంవత్సరాల క్రితం 1000,500ల రూపాల నోట్లు రద్దయ్యాయి. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి.అయినా ఈనాటికి పాత కరెన్సీ కట్టలు కట్టలుగా బైటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని వేల్పూరు మండలం మర్లపాడు గ్రామంలో రద్దు అయిన పాత నోట్ల డంపింగ్ కలకలం సృష్టించింది. 1000,500ల రూపాల నోట్ల కట్టల భారీ డప్పింగ్ బైటపడింది.
ఇటీ వల దొంగ నోట్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సత్తు పల్లి మండలం గౌరీగూడెంకు చెందిన ఓ ముఠా ఈ కరెన్సీని డంప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తమ వద్ద రూ.100 కోట్ల రూపాల విలువైన పాత నోట్లు ఉన్నాయని చెప్పిన ఈ ముఠా నోట్ల కట్టల్లో పైనా..కిందా పాత నోట్లు పెట్టి వాటి మధ్యతో చిత్తు కాగితాలు పెట్టి మోసాలకు పాల్పడుతోంది.
మర్లపాడు గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా ఆ ఇంట్లో పాత కరెన్సీ కట్టలను డంప్ చేసింది. వాటిని చూపిస్తు నకిలీ నోట్ల దందాను చేస్తున్నారు.
పాత కరెన్సీ నోట్లను రిజర్వు బ్యాంక్ ఇంకా తీసుకుంటోందని చెప్పి మదార్ ముఠా మోసాలకు పాల్పడుతున్నారు. రూ. 100 కోట్ల విలువైన పాత కరెన్సీని రిజర్వు బ్యాంకుకు ఇస్తే..కమీషన్ పోను రూ.కోటికి రూ.40 కోట్ల కమీషన్ పోను ఇంకా రూ.60 కోట్లు వస్తాయని నమ్మిస్తూ ఈ రూ.100 కోట్ల డంపింగ్ ను వీడియోలు తీసి కొంతమందికి వల వేసింది ఈ ముఠా. దీంతో దేశ వ్యాప్తంగా కొంతమంది ఈ ముఠా వలలో పడ్డారు. ఈ డంప్ ను డైరెక్ట్ గా చూడాలి అంటే ముందుగా తమకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ కండిషన్ పెట్టింది.
వీరి వలలో పడ్డ టేకులపల్లికి చెందిన ఓ వ్యక్తి సదరు ముఠాకు రూ.7లక్షల 50 వేలు ఇచ్చి చిక్కుకున్నాడు. తరువాత తాను మోస పోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు డంప్ ను గుర్తించి ఈ మదార్ ముఠా ముఠా గుట్టును రట్టు చేశారు. కీలక సూత్రధాని మదార్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం నకిలీ కరెన్సీని సీజ్ చేశారు.