ఏపీలో రూ.వెయ్యి ఇచ్చేది రేపటి నుంచే!

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 02:51 AM IST
ఏపీలో రూ.వెయ్యి ఇచ్చేది రేపటి నుంచే!

Updated On : April 3, 2020 / 2:51 AM IST

గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. రూ.వెయ్యి అందించే సమయంలోనూ పింఛన్ పంపిణీకి అనుసరించిన విధానాన్నే అమలు చేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి డబ్బు అందజేసి.. ఆ కుటుంబ పెద్ద ఫోటోను తీసుకోనున్నారు.(అర్థనగ్నంగా వార్డుల్లో కరోనా అనుమానితులు: నర్సులపై వేదింపులు)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్ల కార్డు కలిగి ఉన్న  ప్రతి కుటుంబానికి రూ.1000 అందజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే గ్రామ/వార్డు వాలంటీర్లు శనివారం(4 ఏప్రిల్ 2020) నుంచి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఈ సొమ్ము అందజేయబోతున్నారు.ఇప్పటివరకు పింఛన్లు పంపిణీకి అవలంబించిన విధానాన్ని ఇప్పుడు  పాటించాలని ప్రభుత్వం ఇప్పుడు  సూచించింది.

 ఈ మేరకు కార్డుదారుడి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని వాలంటీర్లను ఆదేశించింది. డీఆర్‌డీఏ ఈ మేరకు సొమ్మును గ్రామ/వార్డు సచివాలయాల ఖాతాలకు ఇప్పటికే  జమ చేసింది.పేదలు నిత్యావసరాల వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా జగన్ సర్కారు ఈ రూ. వెయ్యి అందజేస్తుంది.

కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ దెబ్బకు పేదలకు ఉపాధి ఆగిపోవడంతొ  రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి. వారికి సాయంగా ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది.