శ్రీశైలంలో కంకణాల కేటుగాళ్లు : రికార్డ్ అసిస్టెంట్ సస్పెండ్
శ్రీశైలం మల్లిఖార్జునుడి సన్నిధి వివాదాలకు కేంద్రంగా మారింది. మల్లిఖార్జునుడు, బ్రమరాంబికా అమ్మవారి కైలాస కంకణాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రికార్డ్ అసిస్టెంట్ వి.లక్ష్మీనారాయణను ఈవో సస్పెండ్ చేశారు.

కర్నూలు : శ్రీశైలం మల్లిఖార్జునుడి సన్నిధి వివాదాలకు కేంద్రంగా మారింది. మల్లిఖార్జునుడు, బ్రమరాంబికా అమ్మవారి కైలాస కంకణాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రికార్డ్ అసిస్టెంట్ వి.లక్ష్మీనారాయణను ఈవో సస్పెండ్ చేశారు. స్వామి, అమ్మవార్ల కంకణాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఈవో శ్రీరామ చంద్రమూర్తి లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు వేశారు. రూ.3.87 లక్షల స్కామ్ జరిగినట్లుగా ఈవో గుర్తించారు. వివాదాలకు కేంద్రంగా శ్రీశైలం మల్లిఖార్జునస్వామి సన్నిధిలో కొన్ని రోజుల క్రితం తాంత్రిక పూజలు జరిపారనే వార్తలు వచ్చిన క్రమంలో ఇప్పుడీ కంకణాల వివాదంతో మరోసారి శ్రీశైలం దేవస్థానం వార్తల్లోకొచ్చింది. ఆలయ ప్రధాన వేద పండితుడు గంటి రాధాకృష్ణను ఆలయ ఈవో శ్రీ రామ చంద్రమూర్తి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.