గర్భిణీకి ఆపరేషన్ చేసిన నర్సులు..శిశువు మృతి

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 06:23 AM IST
గర్భిణీకి ఆపరేషన్ చేసిన నర్సులు..శిశువు మృతి

Updated On : September 24, 2019 / 6:23 AM IST

హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి మరో పసిగుడ్డు బలైపోయింది. అమ్మ కడుపులోంచి బైటకు రాకుండానే మృతి చెందింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బైట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. ఈ దారుణం జనగామ జిల్లాలోని పాలకుర్తి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ లో చోటుచేసుకుంది. 

యూపీహెచ్‌సీలో ప్రసవానికి ఓ గర్భిణి వచ్చింది. హాస్పిటల్ లో డాక్టర్లు లేరు. దీంతో  స్టాఫ్ నర్సులే ఆమెకు ఆపరేషన్ చేసేశారు. దీంతో ఆపరేషన్ వికటించింది. శిశువు మృతిచెందింది. చేతకాని పనులతో ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వీరు చేసిన ఈ పనికి పసిగుడ్డు ప్రాణాలు కోల్పోగా తల్లి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో గర్భిణి బంధువులు సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసిస్తూ..హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ..తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.