ప్రభుత్వ ఉద్యోగం కోసం : ప్రసవవేదనతోనే డీఎస్సీ పరీక్ష
ప్రసవవేదన మెలిపెడుతున్నా పంటిబిగువున భరిస్తునే పరీక్ష రాసింది ఓ మహిళ. పేదరికాన్ని సవాల్ చేస్తు భర్త పడిన కష్టాన్ని తలచుకుంటు ప్రసవ వేదనను కూడా లెక్క చేయకుండా డీఎస్సీ పరీక్షను రాసింది స్వాతి. కష్టపడి తనను చదివించిన భర్త కోరికను..తమ పేదరికాన్ని జయించాలనే కృత నిశ్చయంతో నిండు గర్భిణిగా వున్న స్వాతి పురిటి నొప్పులు సలిపేస్తున్నా చిరునవ్వుతోనే పరీక్ష రాయటం పూర్తి చేసిన వెంటనే స్పృహ కోల్పోయింది.

నెల్లూరు : ప్రసవవేదన మెలిపెడుతున్నా పంటిబిగువున భరిస్తునే పరీక్ష రాసింది ఓ మహిళ. పేదరికాన్ని సవాల్ చేస్తు భర్త పడిన కష్టాన్ని తలచుకుంటు ప్రసవ వేదనను కూడా లెక్క చేయకుండా డీఎస్సీ పరీక్షను రాసింది స్వాతి. కష్టపడి తనను చదివించిన భర్త కోరికను..తమ పేదరికాన్ని జయించాలనే కృత నిశ్చయంతో నిండు గర్భిణిగా ఉన్న స్వాతి పురిటి నొప్పులు సలిపేస్తున్నా చిరునవ్వుతోనే పరీక్ష రాయటం పూర్తి చేసిన వెంటనే స్పృహ కోల్పోయింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాలెంలో జనవరి 3న జరిగింది.
కావలి మండలం తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన థన్యాసి స్వాతి, మహేష్‌లు భార్యాభర్తలు. పెద్దగా చదవుకోని మహేశ్ డిగ్రీ చదువుకున్న స్వాతిని ఉద్యోగస్తురాలిని చేయాలనుకున్నాడు. దీంతో రెక్కాడితేనే గాని డొక్కాడని మహేష్ కూలిపనిచేసుకుంటునే భార్య స్వాతిని ప్రోత్సహించాడు. బీఎడ్ పూర్తి చేయించాడు.. అంతేకాదు డీఎస్సీ కోచింగ్ ఇప్పించాడు. 2018 నవంబరులో ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయడంతో స్వాతి కోచింగ్ తీసుకుని మరీ కష్టపడి చదివింది. ఈ క్రమంలో ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో డీఎస్సీ పరీక్షకు ఆమె హాజరైంది. భర్త ప్రోత్సాహంతో డీఎస్సీ కోచింగ్ ను తీసుకున్న ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పరీక్షకు ముందుగానే నొప్పులు వచ్చే సూచనలు కనిపించినా ఆ విషయాన్ని భర్తకు కూడా చెప్పలేదు. నొప్పులు వస్తున్నా..పైకి మాత్రం చిరునవ్వుతోనే భర్తతో కలిసి ఎగ్జామ్ సెంటర్ కు వచ్చింది. పరీక్ష మొదలైన కాసేపటికే ప్రసవ వేదన ఎక్కువైనా నొప్పులను భరిస్తూ పరీక్షను పూర్తిచేసింది. అయితే, చివరలో స్పృహ కోల్పోయింది.
దీంతో కాలేజీ ఛైర్మన్ పెనుబల్లి బాబునాయుడు తన కారులో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా స్వాతి పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. మరి ఇంత కష్టపడి పరీక్ష రాసిన స్వాతికి ప్రభుత్వం ఉద్యోగం రావాలని కోరుకుందాం..భార్య కోసం కష్టపడి ప్రోత్సహించిన మహేశ్, స్వాతిల కల నెరవేరాలని కోరుకుందాం.