పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం లంచం అడుగుతున్నారు

జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 09:53 AM IST
పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం లంచం అడుగుతున్నారు

Updated On : February 10, 2020 / 9:53 AM IST

జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని

జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందన్నారు. 7లక్షల పెన్షన్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టారని మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) అనురాధ మీడియాతో మాట్లాడారు. టీడీపీ కంటే అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చామని వైసీపీ అబద్ధాలు చెబుతోందన్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూ.600 కోట్ల జీతాలిచ్చి పేదల పొట్ట కొడుతున్నారని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం 20 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిందన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలను వైసీపీ టార్గెట్ చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో రూ.200 ఉన్న ఫించన్ ను రూ.2వేలు చేశారని అనురాధ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 54 లక్షల 25 వేల మందికి ఫించన్లు మంజూరు చేశామన్నారు. ఫించన్ల సంఖ్యను 60లక్షలకు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.. మరి.. వైసీపీ డ్యాష్ బోర్డులో 52లక్షల మందికి ఫింఛన్లు ఇస్తున్నట్టు ఎందుకు కనపడుతోందని ప్రశ్నించారు. ఫించన్లు సరైన సమయానికి రాక కొందరు, ఉన్నవి రద్దు కావడంతో మరికొందరు వృద్ధులు నష్టపోయారని అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ సచివాలయ వ్యవస్థపై అనురాధ విమర్శలు చేశారు. పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కొంతమంది వాలంటీర్లు పేదల దగ్గర రూ.500 లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వాలంటీర్లు ఏ రకంగా లంచాలు వసూలు చేస్తున్నారో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఫించన్లు రాక వృద్ధులు మృతి చెందారని, ఇది వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనమని అనురాధ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కోటి 40లక్షల మందికి చంద్రబాబు రేషన్ ఇస్తే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం 9 నెలల్లోనే 20 లక్షల తెల్లరేషన్ కార్డులు తొలగించిందన్నారు. 

గ్రామ సచివాలయ వ్యవస్థ అవినీతిమయంగా మారిందని అనురాధ ఆరోపించారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు లంచాలు ఇవ్వనిదే ఏ పనీ కావడం లేదన్నారు. వారికి లంచాలు ఇవ్వకపోతే పెన్షన్లు తీసేస్తున్నారని, రేషన్ కార్డులు తొలగిస్తున్నారని మండిపడ్డారు.