3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు : సీఎం జగన్ పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
22 మంది వైసీపీ ఎంపీలు... ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.

22 మంది వైసీపీ ఎంపీలు… ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.
22 మంది వైసీపీ ఎంపీలు… ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించుకుంటారో వైసీపీ ఎంపీలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రెండు బడ్జెట్లు వచ్చాయని.. వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. అమరావతి రైతుల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తే వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ ప్రతాపాన్ని కేంద్ర ప్రభుత్వం చూపాలన్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధిస్తారని గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 22 మంది ఎంపీలను గెలిపిస్తే హోదాపై పోరాడతామని జగన్ అన్నారని చెప్పారు. జగన్ ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం ఇప్పటికీ రెండు బడ్జెట్ లు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రానికి జగన్ రూపాయి తెచ్చే పరిస్థితి కనపడటం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదాపై జగన్ పోరాడటం లేదని విమర్శించారు.
ప్రత్యేక హోదాపై ప్రజలు దృష్టి మరల్చేందుకే రాజధానుల వ్యవహారం అని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించడం లేదన్నారు. అమరావతి రైతుల సమస్యలను పార్లమెంట్ లో తాము ప్రస్తావిస్తుంటే మా ముగ్గురు ఎంపీలపై వైసీపీ ఎంపీలు దాడి చేస్తున్నారని తెలిపారు.
అమరావతి రాజధాని రైతులు రోడ్డున్న పడ్డారని..వారిని పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రత్యేకహోదాపై చిలుకపలుకులు పలికిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో రైతుల పరిస్థితిని పార్లమెంట్ ప్రస్తావించారు. ఏపీకి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని విమర్శించారు. మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలించి ప్రజల మధ్య చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేస్తే తాము మద్దతిస్తామని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిణామాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషంగా ఉన్నారని.. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి టీడీపీకి కట్టుబడి ఉందన్నారు. ఏడు నెలల కాలంలో ఒక్కసారి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని విమర్శించారు.