సామర్లకోటలో ఉద్రిక్తత : రాళ్లు, బాటిల్స్‌తో కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరు వర్గీయులు రాళ్లు, బాటిళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ వినోద్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తకు చెందిన టైల్స్ షాప్ అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్ దగ్గరికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్తగా అటు గ్రామంలోనూ, స్టేషన్ దగ్గర భారీగా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదమే ఈ ఘర్షణకు కారణం అని తెలుస్తోంది.