ఆయనకు నలుగురు: చెప్పేవి పాఠాలు.. చేసేవి తప్పుడు పనులు

  • Published By: vamsi ,Published On : February 18, 2020 / 04:14 AM IST
ఆయనకు నలుగురు: చెప్పేవి పాఠాలు.. చేసేవి తప్పుడు పనులు

Updated On : February 18, 2020 / 4:14 AM IST

అతను విద్యా బుద్దులు నేర్పే బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్నాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తప్సుడు పనులు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. అసలు విషయం ఏంటంటే? భార్య బతికుండగానే.. ఆమె చనిపోయినట్లు నమ్మించి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను వరుస వివాహాలు చేసుకుంటున్నాడు ఆ ఉపాధ్యాయుడు. ఇలా ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న అతనిపై అతడి రెండో భార్య ‘పోలీస్‌ స్పందన’ కార్యక్రమంలో గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుకు సోమవారం(17 ఫిబ్రవరి 2020) ఫిర్యాదు చేసింది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్‌ వల్లూరుకు చెందిన మహమ్మద్‌ బాజీ అలియాస్‌ షేక్‌ బాజీ అదే గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి 2011లో తెలిసిన వ్యక్తుల ద్వారా బాధితురాలి తండ్రిని నమ్మించి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి రెండు నెలలు ఆమెను తన ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత వేరే కాపురం పెడతామని చెప్పి విజయవాడలో ఓ గది అద్దెకు తీసుకుని మకాం మార్చాడు.

ఈ క్రమంలో కొన్ని రోజులపాటు ఆమె దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాడు బాజీ. కొన్ని రోజుల తర్వాత కేవలం ఆదివారం మాత్రమే వస్తూ తర్వాత అసలు రావడం మానేశాడు. ఈ క్రమంలో బాధితురాలు ఆరా తీయగా.. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మూడో పెళ్లి చేసుకుని రహస్య కాపురం చేస్తున్నట్లు గుర్తించింది. ఇదేమని నిలదీయగా కొట్టడంతో ఆమెకు గర్భస్రావమైంది. ప్రాణా పాయ స్థితికి చేరుకోగా ఆస్పత్రిలో వదిశాడు.

ఇదిలా ఉంటే ఇటీవల దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ల మైనర్‌ అమ్మాయిని తల్లిదండ్రులకు రూ.30 వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాజీపై తక్షణమే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్పీ విజయారావు తెనాలి డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.   

teacher