ఆగని మరణాలు : మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం (ఏప్రిల్ 27,2019) ఉదయం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనుపల్లిలో ఈ ఘటన జరిగింది. బైపిసి

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 07:45 AM IST
ఆగని మరణాలు : మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Updated On : April 27, 2019 / 7:45 AM IST

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం (ఏప్రిల్ 27,2019) ఉదయం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనుపల్లిలో ఈ ఘటన జరిగింది. బైపిసి

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం (ఏప్రిల్ 27,2019) ఉదయం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనుపల్లిలో ఈ ఘటన జరిగింది. బైపిసి ఫస్టియర్‌లో ఒక సబ్జెక్టులో ఫెయిలైన శిరీష (15) మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. శిరీష మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంటర్ లో ఫెయిల్ అయ్యామనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 19కి చేరింది. ప్రభుత్వం ఫెయిలైన విద్యార్థులందరికి ఉచితంగా రీ-వాల్యుయేషన్ జరిపిస్తోంది. శనివారం నుంచే రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పొడద్దని ప్రభుత్వం చెబుతున్నా… ఆత్మహత్యలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల మరణాలు, ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ నుంచి నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. 9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తే 3.5లక్షల మంది ఫెయిల్ అయ్యారు. పాస్ అవుతామని నమ్మకండా ఉన్నవారు ఫెయిల్ అయ్యారు. టాపర్లకు సున్నా మార్కులు వచ్చాయి. ఇంటర్ బోర్డు నిర్వాకంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.