చంద్రబాబు జైలుకెళ్లినా రాజధాని తరలిస్తాం: స్పీకర్ తమ్మినేని

  • Published By: vamsi ,Published On : January 7, 2020 / 01:55 AM IST
చంద్రబాబు జైలుకెళ్లినా రాజధాని తరలిస్తాం: స్పీకర్ తమ్మినేని

Updated On : January 7, 2020 / 1:55 AM IST

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ఖాయమని వెల్లడించారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వెల్లడించారు. రాజధాని అమరావతి కోసం జైలుకైనా వెళ్తానని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు తీహారు జైలుకెళ్లినా విశాఖపట్నంలో రాజధానిని పెట్టడం మాత్రం ఆగదని స్పీకర్‌ స్పష్టం చేశారు. పొందూరు మండలంలోని పలు పంచాయతీల్లో గ్రామ సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేసిన తమ్మినేని ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కడ పడిపోతుందనే భయంతో చంద్రబాబు, టీడీపీ నాయకులు మూడు రాజధానులపై రాద్ధాంతం చేస్తున్నారని, అంతే తప్ప అమరావతిపై ప్రేమతో కాదని అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆశయం అని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? అని ప్రశ్నించారు తమ్మినేని. దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కూలీలే కనిపిస్తున్నారని తమ్మినేని అన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకపోవడంతోనే పనుల కోసం వారు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్నాళ్లకు జగన్ నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేందుకు అవకాశం లభించిందని అన్నారు. చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతానికి అన్యాయం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. రాయలసీయ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తాగు, సాగు నీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.ఇదే సమయంలో గ్రామ వలంటీర్లకు త్వరలో పేస్కేల్‌ అమలు చేస్తామని అన్నారు.