భార్య, మరదలు, అత్తని చంపి శవాలపై రేప్

హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వావివరసలు మర్చిపోవడమే కాదు.. మృగాలు సిగ్గుపడే విధమైన పనిచేశాడు. భార్య, మరదలు, అత్తను చంపడమే కాకుండా శవాలను రేప్ చేశాడు. సోనెపట్ జిల్లా పత్తి కలియానా గ్రామానికి చెందిన నూర్ హసన్ ఈ దారుణాన్ని ఒడిగట్టాడు.
పోలీస్ ఇంటరాగేషన్ లో హసన్ భార్య మధు(25), మరదలు మనీషా(18), అత్తయ్య జమీలా (48)లను చంపాడు. భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమెకు మరదలు సపోర్ట్ చేస్తుందని అనుమానించాడు. పదునైన ఆయుధంతో భార్యను, మరదలిని సెప్టెంబర్ 5న హత్య చేశాడు.
ఆ తర్వాత వాటిని పూడ్చిపెట్టడానికి ప్రయత్నించాడు. మూడు రోజుల తర్వాత అత్తను గమ్రీ గ్రామానికి తీసుకెళ్లి గొంతుకోసి హత్యచేశాడు. ఆమె శవాన్ని కాల్చేందుకు ప్రయత్నించాడు. నిందితుడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..
పోలీసులు మృతదేహాలను సెప్టెంబరు 6, 7, 8తేదీల్లో పలు ప్రదేశాల్లో కనుగొన్నారు. అతనిపై సెక్షన్ 302, 201 ప్రకారం కేసులు ఫైల్ చేశారు.