RTC తాత్కాలిక కండక్టర్‌పై డ్రైవర్.. అత్యాచారయత్నం

RTC తాత్కాలిక డ్రైవర్‌పై రేప్ కేసు నమోదైంది. మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్ బస్ స్టాపుల దగ్గర బస్ ఆపకుండా పోనిచ్చాడు. ఈ క్రమంలో అందులో ఉన్న తాత్కాలిక మహిళా కండక్టర్ పట్ల అసభ్యకర ప్రవర్తించాడు.
బస్సును నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి.. లైంగికంగా హింసించాలని చూశాడు. కండక్టర్ అతణ్నుంచి తప్పించుకుని జైపూర్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్ సిద్ధిపేట నుంచి కామారెడ్డికి అసాధారణ పద్ధతిలో డ్రైవింగ్ చేసినందుకు గాను రూ..2వేలు ఫైన్‌ను విధించారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి నరేశ్ కు ఐదురోజు ఖైదు తప్పదని నిర్ణయించింది ప్రభుత్వం.