కుటుంబ నియంత్రణ ఆపరేషన్ : డాక్టర్లు లేక మహిళల ఇబ్బందులు

సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు.

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 11:06 AM IST
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ : డాక్టర్లు లేక మహిళల ఇబ్బందులు

Updated On : September 13, 2019 / 11:06 AM IST

సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు.

సర్కార్ దవాఖానా నిర్లక్ష్యానికి నిదర్శనమని మరోసారి నిరూపితమయ్యింది. సూర్యపేట జిల్లా తుంగతుర్తి ఆస్పత్రి డాక్టర్లు నిర్వాకం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మహిళలు ఆస్పత్రికి వచ్చారు. డాక్టర్ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో మహిళల అవస్థలు పడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి మహిళలు నిరీక్షిస్తున్నారు. డాక్టర్ కోసం ఇవాళ ఉదయం నుంచి పడిగాపులు
గాస్తున్నారు.

దాదాపు 200 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి రాగా.. సిబ్బంది 60 మందికి టోకన్లు ఇచ్చి పంపించారు. ఉదయం 8 గంటల కల్లా రావాలని చెప్పడంతో వీరిలో కొందరు నిన్న సాయంత్రం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం దాటినా డాక్టర్ రాకపోవడంతో తిండి, తిప్పలు లేకుండా మహిళలు నానా అవస్తలు పడుతున్నారు. 

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఎలాంటి హారం తీసుకోకూడని సిబ్బంది చెప్పడంతో ఉదయం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మహిళలు గంటల కొద్ది నిలబడ్డారు. ఉదయం 8 గంటలకు రావాలని చెప్పారు..కానీ మధ్యాహ్నం 2 గంటల వరకు వారిని ఎవరు కూడా పట్టించుకోలేదు. డాక్టర్ హైదరాబాద్ నుంచి రావాల్పివుందని చెప్పి మహిళలను చాలా సేపు వెయిట్ చేయించారు. తీరా అర్ధగంట క్రితం డాక్టరు ఆస్పత్రికి చేరుకున్నారు. కొద్ది సేపటి నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభించారు.

తుంగతుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆస్పత్రి. దాదాపు 6 మంది డాక్టర్లు ఇక్కడ ఉండాలి. కానీ కనీసం ఇద్దరు డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. లోకల్ లో రెగ్యులర్ గా ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండడు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే చూడటానికి ఎవరూ ఉండకపోవడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టరు శస్త్ర చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లను అందుబాటులో ఉంచాలని స్థానికులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : మూడో తరగతి విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్