ఎంత భక్తో: 2 కోట్ల రూపాయి నోట్లతో అమ్మవారికి అలంకారం

ఎంత భక్తో: 2 కోట్ల రూపాయి నోట్లతో అమ్మవారికి అలంకారం

Updated On : October 6, 2019 / 8:18 AM IST

విశాఖ నగరంలో గల కురుపాం మార్కెట్ సమీపంలో ఉన్న అమ్మవారిని ఘనంగా అలంకరించారు. వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయంలో కొలువై ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ సభ్యులు మహాలక్ష్మి అవతారాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. 

ఆదివారం 2 కోట్ల రూపాయల నోట్లతో అలంకారాన్ని పూర్తి చేశారు. మహాలక్ష్మీ అవతారాన్ని రూ.2కోట్ల నగదుతో అలంకరించడం విశేషం చోటు చేసుకుంది. ఈ వార్త విన్న భక్తులు వందలాది సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.