నరకాసురుడి కోరిక : దీపావళి పండుగ

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 08:59 AM IST
నరకాసురుడి కోరిక : దీపావళి పండుగ

Updated On : October 23, 2019 / 8:59 AM IST

దీపావళికి సంబంధించి ఒక్కో పురాణంలో ఒకో రకమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. విష్ణుపురాణంలో ప్రకారం దీపావళి రోజున ప్రాత:కాలమే లేచి అంటే సూర్యుడు ఉదయించటానికి ముందే లేచి స్నానం చేసి ఐశ్వర్యాల దేవత అయిన మహాలక్ష్మీదేవిని పూజించుకోవాలి. దీపాలతో ఇంటిని అలంకరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది. దీపావళి శ్రీ కృష్ణుడు భార్య సత్యభామ నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజునే దీపావళిగా జరుపుకుంటున్నాం. 
వరం గర్వంతో నరకాసురుడు భూలోకంలో ప్రజలనే కాక..దేవలోకంలో కూడా నరకాసురుడు అరాచకాలకు పాల్పడ్డాడు. దేవతలను కూడా చిత్ర హింసలకు గురిచేశాడు. చివరకు శ్రీకృష్ణుడి భార్య సత్యభామ చేతిలో సహంరించబడ్డాడు. సత్యభామ బాణాలకు నేలకొరిగిన నరకాసురుడు మరణించేముందు..శ్రీ కృష్ణుడిని ఓ వరం కోరుతాడు. తాను మరణించిన ఈ రోజును ప్రజలు గుర్తించుకోవాలనీ..అందుకోసం ఎంతో ఉత్సాహంగా పండగ చేసుకోవాలని కోరాడు. అతని కోరిక ప్రకారమే.. దీపావళి పండుగ రోజున టపాసులను పేల్చి.. స్వీట్లు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని సంతోషంగా పండుగ చేసుకుంటారు. 

దీపావళిని ఉత్తరాదిన ఐదురోజుల పాటు జరుపుకుంటారు.ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. లక్ష్మీపూజ ఎంతో అట్టహాసంగా భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు.  ప్రజలను పీడించిన రాక్షసులను వధించిన కాళీమాత ఆగ్రహం చల్లాక వారి  రక్తాన్ని కూడా తాగింది. అప్పటికీ కాళీమాత ఆగ్రహం చల్లారలేదు. ఆమెను శాంతింపజేయటానికి దేవతలు ఎన్నో శాంతి పూజలు చేసిన రోజు దీపావళి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఉత్తరాదిన దీపావళి రోజున లక్ష్మీ పూజ..కాళిపూజ కూడా చేస్తారు. 

కాళిమాత రూపాన్ని ప్రతిష్టించి..దీపాల వరుసను ఏర్పాటు చేసి..వాటిని వెలిగిస్తారు. స్కంధ పురాణం ప్రకారం పరాశక్తి 21 రోజుల పాటు కేదార గౌరి వ్రతం చేసి దీపావళి రోజున ముగించిందని..ఈ వ్రతం తరువాత పమర శివుడు తన శరీరంలో సగభాగాన్ని పర్వతీదేవికి ఇచ్చాడని చెబుతోంది. అప్పటి నుంచి శివుడు అర్థనారీశ్వరుడిగా పేరు పొందాడని కథనాలు ఉన్నాయి.